పట్నా: ఉత్తరప్రదేశ్‌లోని ఒక వింత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న టమోటాలకు పోలీసు సిబ్బంది కాపలాగా నిలుచున్న ఆ దృశ్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. టమాటాలు రోడ్డున పడ్డాయన్న సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల వారు వాటిని ఎత్తుకెళ్లేందుకు హైవేపైకి గుంపులుగా చేరుకున్నారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని తరిమికొట్టడంతో వారంతా మౌనంగా వెనుదిరిగారు.
వివరాల్లోకి వెళితే ఒక లారీలో 1,800 కిలోల టమోటాలను ఢిల్లీకి తరలిస్తుండగా దారిలో ఆ లారీ ప్రమాదానికి గురైంది. దీంతో లారీలోని టమాటాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే సదరు టమాటాల యజమాని టమాటాల భద్రత కోసం పోలీసులకు సమాచారం అందించారు. అర్జున్ అనే వ్యక్తి ఈ లారీని బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నాడు.
ఝాన్సీ-గ్వాలియర్ హైవేలోని సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 12 గంటల సమయంలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ వెనుకే స్కూటీపై వస్తున్న ఒక మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. టమాటాలు ఎవరూ ఎత్తుకెళ్లకుండా చూసేందుకు ముగ్గురు పోలీసులు ఘటనా స్థలంలో కాపలాగా నిలిచారు. ఉదయాన్నే క్రేన్ రాగానే, లారీని సరిచేసి మళ్లీ టమాటాలను లారీలోకి ఎక్కించారు. అంత వరకూ పోలీసులు అక్కడే కాపలాగా ఉన్నారు. ప్రస్తుతం టమోటాల ధర మార్కెట్‌లో కిలో రూ.80 నుంచి రూ.120 వరకు ఉంది. పలు చోట్ల భారీ వర్షాలకు టమాటా పంట నాశనమైంది. దీంతో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
बंगलुरू से 1800 किलो टमाटर लेकर दिल्ली जा रहा ट्रक झांसी, यूपी में पलट गया। टमाटर की लूट न हो जाए, इसलिए रातभर पुलिस तैनात रही। मार्केट में टमाटर का रेट 80 से 120 रुपए किलो तक है।@RajuSha98211687 pic.twitter.com/g19jkVgOSs
— Sachin Gupta (@SachinGuptaUP) October 18, 2024
ఇది కూడా చదవండి: గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు
Comments
Please login to add a commentAdd a comment