రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
Published Wed, Apr 19 2017 10:20 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కర్నూలు : కర్నూలు శివారులోని జాతీయ రహదారిపై మహీంద్రా షోరూమ్‌కు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్డెగేరికి చెందిన మగ్బూల్ బాషా కుమారుడు ముల్లా ఇమ్రాన్ బాషా(34) అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతను శరీన్‌నగర్‌లో ఉన్న బ్లూబర్డ్ వాటర్ ప్యూరిఫై కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఆఫీసు నుంచి ఏపీ21 క్యూ 4756 ద్విచక్ర వాహనంపై సంతోష్‌నగర్ వైపు వెళ్తుండగా ఎదురుగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అతను రోడ్డుపై కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనకు 2013లో పెళ్లి అయింది. ఇద్దరు సంతానం. భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాల్గో పట్టణ సీఐ నాగరాజరావు తెలిపారు.
Advertisement
Advertisement