- హైవేల్లోని ప్రమాద స్థలాల పరిశీలన
- రెండు అధికారుల బృందాల సర్వే
అక్కడే ఎందుకో?
Published Mon, Mar 20 2017 12:39 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM
రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఒకే ప్రాంతంలో పదే పదే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రాణనష్టం జరుగుతుంటే.. అక్కడ ప్రమాదాలు ఎందుకు అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని వాటి నివారణకు చర్యలు చేపట్టాలి్సందే. ఈ కోణంలోనే జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న ప్రదేశాలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపే దిశగా ఓ సమగ్ర సర్వే జరిగింది. రాష్ట్ర డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఈ సర్వే ఈ నెల 11 నుంచి మొదలై ఆదివారంతో ముగిసింది. ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
అమలాపురం టౌన్ :
జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వారం రోజులుగా అధికారుల రెండు సర్వే బృందాలు విస్తృతంగా పర్యటించి ప్రమాదాల ప్రదేశాలను, కారణాలను, పరిష్కారాలను కనుగొన్నాయి. డీఎస్పీ స్థాయి అధికారి, మోటారు వెహికల్ ఇ¯ŒSస్పెక్టర్ (ఎంవీఐ), ఆర్‌అండ్‌బీ ఇంజినీరు, స్థానిక పోలీసు అధికారులు ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో సమగ్ర సర్వేను ఆదివారం సాయంత్రానికి పూర్తి చేశాయి. ఒక బృందంలో కాకినాడ మహిళా విభాగం డీఎస్పీ వి.విజయారావు, కాకినాడ ఎంవీఐ దుర్గావిఠల్, ఆర్‌అండ్‌బీ ఇంజినీరు నరసింహరావు ఉన్నారు. మరో బృందంలో కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. పరిష్కార మార్గాలు సూచించే ఈ సర్వే నివేదికలు డీజీపీకి అందజేస్తారు.
వంద మీటర్లు..
మూడు ప్రమాదాలు..
మూడు ప్రాణాలు
సర్వే నిర్వహణకు కొన్ని పరిమితులతో శాస్త్రీయంగా నిర్వహించారు. జాతీయ లేదా రాష్ట్ర రోడ్డులో ఎక్కడైనా ఏడాది కాలంలో వంద మీటర్ల రోడ్డు పరిధిలో వరుసగా మూడు రోడ్డు ప్రమాదాలు జరిగి కనీసం ముగ్గురు... ఆ పైన వ్యక్తులు చనిపోతే... అలాంటి చోట్ల మరింతగా పరిశీలన చేశారు. అసలు అక్కడే ఇన్ని ప్రమాదాలు... ఇంతమంది చనిపోవడానికి కారణాలను కూడా ఐదు కోణాల్లో సర్వే పత్రాల్లో నమోదు చేశారు. రోడ్డు సరిగా లేకపోవటమా? మానవ తప్పదమా? (నిర్లక్ష్య డ్రైవింగ్) వాహన లోపమా? రోడ్డు నిబంధనలు పాటించకపోవడమా? రోడ్డు మార్జిన్లు ఆక్రమణలకు గురై రోడ్డు ఇరుకుగా ఉండటం వల్లా? ఈ కారణాలపై బృందాలు అధ్యయనం చేశాయి. ఉదాహరణకు అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి శివారు ఆర్‌ఆర్ నగర్ వద్ద స్టేట్ హైవే 104 రోడ్డులో వంద మీటర్ల పరిధిలో గత ఎనిమిది నెలల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. డీఎస్పీ విజయారావు ఆధ్వర్యంలోని సర్వే బృందం పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌తో కలసి ఆదివారం మధ్యాహ్నం గంటకు పైగా ఆ రోడ్డుపై ఉండి వాహనాలు రాకపోకలు... వేగం.. పరిశీలించారు. వివరాలను సర్వే పత్రాల్లో నమోదు చేశారు.
ఇవీ డేంజర్ స్పాట్లు..
ఈ రెండు బృందాలు జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో దాదాపు 130 చోట్ల రోడ్డు ప్రమాదాలపై సర్వేతో అధ్యయనం చేసింది. జిల్లాలో అడ్డతీగల, రంగంపేట,
పి.గన్నవరం నుంచి గంటి రోడ్డు (కాలువ పక్క రోడ్డు), ఐ.పోలవరం మండలం కొమరిగిరి మలుపు (216 హైవే) రోడ్లపై ఒకేచోట పలు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు వాటిల్లినట్టు గుర్తించాయి. జాతీయ రహదారిలో జగ్గంపేట, రాజానగరం–కాకినాడ రోడ్డు (ఏడీబీ)పై ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు బృందం నిర్ధారించింది.
ఇవీ వైఫల్యాలు..
ఈదరపల్లి ఆర్‌ఆర్ నగర్ వద్ద ఈ వంద మీటర్ల రోడ్డు కొద్ది దూరంలో చిన్నపాటి మలుపు ఉండడాన్ని గుర్తించారు. స్టేట్ హై వేలు ఏడు మీటర్ల వెడుల్పు ఉండాల్సి ఉంది. అయితే ఇక్కడ ఐదున్నర మీటర్ల వెడుల్పు మాత్రమే ఉంది. రోడ్డు మధ్యలో సెంట్రల్ లై¯ŒS (తెల్లటి రంగుతో ఉండే లై¯ŒS) రోడ్డుపై లేదు. రోడ్డుకు ఓ పక్క మార్జి¯ŒS లేకుండా మట్టిగుట్టలు ఉన్నాయి. దీని వల్ల వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు రోడ్డు మార్జి¯ŒSలోకి వచ్చే వీలు లేదు. వీటి వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంచనాకు సర్వే బృందం వచ్చినట్టు తెలిసింది. ఈ విషయాలపై ఆర్‌అండ్‌బీ ఇంజినీరును సర్వే బృందం గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. రోడ్డుకు ఉండాల్సిన కొన్ని నిబంధనలు ఇక్కడ అమలు కాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement