'మారియన్'పై తెలుగు నిర్మాతల కన్ను | Telugu Producers eye on Mariyaan | Sakshi
Sakshi News home page

'మారియన్'పై తెలుగు నిర్మాతల కన్ను

Published Sun, Aug 4 2013 7:52 PM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM

మారియన్

మారియన్

హైదరాబాద్:  భారత్ బాల దర్శకత్వంలో ధనుష్ -పార్వతీమీనన్ నటించిన తమిళ చిత్రం 'మారియన్'పై టాలీవుడ్ చిత్ర నిర్మాతల కన్నుపడింది. గత నెల 19న విడుదలైన ఈ చిత్రంకు సూపర్  హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్ల కనక వర్షం కురిపించిందని కోలీవుడ్ సమాచారం.  వేణు రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ అద్భుతంగా నటించాడని అభిమానులు పొంగిపోతున్నారు. ఈ చిత్రం చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటనను మెచ్చుకున్నారు. ఆస్కార్ అవార్డు పొందిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు  అదిరిపోయే సంగీతం అందించారు.


 తమిళంలో   హిట్టు కొట్టిన  ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలన్న ఆలోచనతో  ఓ పెద్ద నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది.  కొందరు ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారా లేక డబ్బింగ్ చేస్తారా అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement