మరణం లేనివాడు! | mariyaan movie audio release on 29th march | Sakshi
Sakshi News home page

మరణం లేనివాడు!

Published Sat, Mar 14 2015 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

మరణం లేనివాడు!

మరణం లేనివాడు!

ఈ ఏడాది తెలుగు నాట ధనుష్ హవా నడుస్తోంది. రఘువరన్ బీటెక్, అనేకుడులాంటి అనువాద చిత్రాలతో విజయాలు అందుకున్న ధనుష్ ఇప్పుడు ‘మరియన్’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. అదే టైటిల్‌తో ఎస్వీఆర్ మీడియా శోభారాణి తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్. రహమాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శోభారాణి విలేకరులతో మాట్లాడుతూ -‘‘మరియన్ అంటే మరణం లేనివాడు అని అర్థం. యముడు కూడా తనను ఏమీ చేయలేడనే మనోనిబ్బరం ఉన్న వ్యక్తి అతను. ఈ పాత్రను ధనుష్ అత్యద్భుతంగా చేశారు. విదేశాల్లో కిడ్నాప్‌కు గురైన ముగ్గురు భారతీయులు, 21 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి ఎలా బయటపడ్డారు? అనేది ఈ చిత్రకథ. ఏప్రిల్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement