Mariyaan
-
పాడనా తెలుగు పాట!
ప్రపంచాన్ని తన స్వరంతోనూ, గళంతోనూ ఉర్రూతలూపే ఏ.ఆర్. రెహమాన్ మరోసారి తెలుగులో గొంతు సవరించుకున్నారు. ధనుష్ హీరోగా తెలుగులోకి వస్తున్న ‘మరియన్’ సినిమా కోసం తెలుగులో పాట పాడారు. గీత రచయిత చంద్రబోస్ రాసిన ‘మనసా పదా...’ అనే తెలుగు పాటను ఆయన ఇటీవలే లాస్ ఏంజెల్స్‌లో పాడి, రికార్డు చేశారు. తమిళ మాతృక (అక్కడ సినిమా పేరు కూడా ‘మరియన్’)లోని ఈ పాట రెహమాన్ పాడినదే. సినిమా క్లైమాక్స్‌లో వస్తుందీ పాట. ‘వందేమాతరం’ ఫేమ్ భరత్ బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి ఎస్.వి.ఆర్. మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శోభారాణి విడుదల చేస్తున్నారు. నిజానికి, మొదట ఈ తెలుగు పాట పాడడానికి రెహమాన్ సంకోచించారట. కానీ, చివరకు పాట సందర్భం నచ్చి, పాడారట. ఇంకేం, రెహమాన్ గళంలో మరో తెలుగు పాట వినడానికి సిద్ధం కండి! -
మరణం లేనివాడు!
ఈ ఏడాది తెలుగు నాట ధనుష్ హవా నడుస్తోంది. రఘువరన్ బీటెక్, అనేకుడులాంటి అనువాద చిత్రాలతో విజయాలు అందుకున్న ధనుష్ ఇప్పుడు ‘మరియన్’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. అదే టైటిల్‌తో ఎస్వీఆర్ మీడియా శోభారాణి తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్. రహమాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శోభారాణి విలేకరులతో మాట్లాడుతూ -‘‘మరియన్ అంటే మరణం లేనివాడు అని అర్థం. యముడు కూడా తనను ఏమీ చేయలేడనే మనోనిబ్బరం ఉన్న వ్యక్తి అతను. ఈ పాత్రను ధనుష్ అత్యద్భుతంగా చేశారు. విదేశాల్లో కిడ్నాప్‌కు గురైన ముగ్గురు భారతీయులు, 21 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి ఎలా బయటపడ్డారు? అనేది ఈ చిత్రకథ. ఏప్రిల్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
విదేశంలో కిడ్నాప్
ధనుష్, పార్వతి మీనన్ జంటగా భరత్ బాల దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘మరియన్’, అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఎస్వీఆర్ మీడియా పతాకంపై పలు విజయవంతమైన అనువాద చిత్రాలు అందించిన శోభారాణి ఈ చిత్రాన్ని అనువదించారు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. ఈ వేడుకలో నిర్మాతలు దామోదరప్రసాద్, టి. ప్రసన్నకుమార్, హీరో ప్రిన్స్, సెన్సార్ బోర్డ్ సభ్యురాలు రాధాదేవి తదితరులు పాల్గొన్నారు. శోభారాణి మాట్లాడుతూ - ‘‘కొంత విరామం తర్వాత మేం విడుదల చేస్తున్న చిత్రం ఇది. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. విదేశాల్లో కిడ్నాప్‌కు గురైన ముగ్గురు భారతీయులు, 21 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి ఎలా బయటపడ్డారు? అనేది ఈ చిత్రం కథాంశం. ఏ.ఆర్. రహమాన్‌గారు స్వరపరచిన పాటలు ఓ ప్రధాన ఆకర్షణ. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
'మారియన్'పై తెలుగు నిర్మాతల కన్ను
హైదరాబాద్: భారత్ బాల దర్శకత్వంలో ధనుష్ -పార్వతీమీనన్ నటించిన తమిళ చిత్రం 'మారియన్'పై టాలీవుడ్ చిత్ర నిర్మాతల కన్నుపడింది. గత నెల 19న విడుదలైన ఈ చిత్రంకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్ల కనక వర్షం కురిపించిందని కోలీవుడ్ సమాచారం. వేణు రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ అద్భుతంగా నటించాడని అభిమానులు పొంగిపోతున్నారు. ఈ చిత్రం చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటనను మెచ్చుకున్నారు. ఆస్కార్ అవార్డు పొందిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతం అందించారు. తమిళంలో హిట్టు కొట్టిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలన్న ఆలోచనతో ఓ పెద్ద నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారా లేక డబ్బింగ్ చేస్తారా అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.