విదేశంలో కిడ్నాప్ | Dhanush & Parvathi Menon Lip Lock Scene In Mariyaan | Sakshi
Sakshi News home page

విదేశంలో కిడ్నాప్

Published Thu, Feb 12 2015 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

విదేశంలో కిడ్నాప్

విదేశంలో కిడ్నాప్

 ధనుష్, పార్వతి మీనన్ జంటగా భరత్ బాల దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘మరియన్’, అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఎస్వీఆర్ మీడియా పతాకంపై పలు విజయవంతమైన అనువాద చిత్రాలు అందించిన శోభారాణి ఈ చిత్రాన్ని అనువదించారు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. ఈ వేడుకలో నిర్మాతలు దామోదరప్రసాద్, టి. ప్రసన్నకుమార్, హీరో ప్రిన్స్, సెన్సార్ బోర్డ్ సభ్యురాలు రాధాదేవి తదితరులు పాల్గొన్నారు.

శోభారాణి మాట్లాడుతూ - ‘‘కొంత విరామం తర్వాత మేం విడుదల చేస్తున్న చిత్రం ఇది. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. విదేశాల్లో కిడ్నాప్‌కు గురైన ముగ్గురు భారతీయులు, 21 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి ఎలా బయటపడ్డారు? అనేది ఈ చిత్రం కథాంశం. ఏ.ఆర్. రహమాన్‌గారు స్వరపరచిన పాటలు ఓ ప్రధాన ఆకర్షణ. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement