
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. సినిమాల రిలీజ్ విషయంలో ఎదురవుతున్న పోటి వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇన్ని సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేలా ఎలా పర్మిషన్ ఇస్తారంటూ చిన్న సినిమాల నిర్మాతలు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను నిలదీస్తున్నారు.
వీరికి నిర్మాతల మండలిలోని విశాల్ వ్యతిరేఖవర్గం మద్ధుతు తెలపడంతో వివాదం మరింత ముదిరింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో సినిమాల విడుదలకు పర్మిషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ టీనగర్‌లోని నిర్మాతల సంఘం ఆఫీస్‌లకు తాళం వేశారు. ఒకే రోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమా నిర్మాతల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment