రామానుజర్ చిత్రంలో ఓ సన్నివేశం
జగద్గురువు రామానుజర్ గురించి తెలియని వారు ఉండరు. విష్ణుభక్తుడు. హిందూ మత పరిరక్షకుడు. కులమతాలకతీతంగా జనోద్ధరణకు పాటుపడిన మహానుభావుడు రామానుజన్ జీవిత చరిత్ర గురించి ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలు రూపొందాయి. తమిళంలోనూ ఆయన జీవిత చరిత్రతో సీరియల్ రూపొందింది. తాజాగా శ్రీ రామనుజన్ బయోపిక్‌ను శ్రీకృష్ణన్ తన హయగ్రీవ సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించి టైటిల్ పాత్రను పోషించారు. ఆయనతో పాటు నటుడు రాధారవి, కోట శ్రీనివాసరావు, వైజీ మహేంద్రన్, శ్రీమాన్, నిళల్‌గళ్ రవి, సిమ్రాన్, గాయత్రి ముఖ్యపాత్రలు పోషించారు.
ఇరవి చందర్ వరద నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో త్వరలో రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం ఒక నక్షత్ర హోటల్లో చిత్రం సింగిల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామానుజన్ జీవిత చరిత్రతో రూపొందిన ఈ చిత్రం ఒక మహా కావ్యంగా పేర్కొన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చిత్ర నిర్మాత కథానాయకుడు శ్రీకృష్ణన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాణానికి చాలా శ్రమించినట్లు చెప్పారు.
తమకు తమిళ నిర్మాతల సంఘం ఏ విధంగానూ సహకరించలేదని, అది ఉన్నా లేనట్టేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే రామానుజర్ చిత్రం బాగా వచ్చిందని దీనికి ఇళయరాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ చిత్ర సింగిల్ సాంగ్ మిలియన్‌కు పైగా ప్రేక్షకులు చూశారని చెప్పారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించినట్లు ఆ వేదికపై ఇళయరాజా చిత్రంలోని ఐదు పాటలను లైవ్‌లో పాడి సంగీత ప్రియులను అలరింపచేస్తారని చెప్పారు. చిత్రం విజయం ఖాయమని, దానిని ఎలా ప్రమోట్ చేయాలన్నది తనకు తెలుసని శ్రీకృష్ణన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment