
విశాల్‌కు నిర్మాతల మండలి షాక్ !
నటుడు విశాల్ తమిళ నిర్మాతల మండలి పెద్ద షాక్ ఇచ్చింది. నిర్మాతల మండలిలో ఆయన సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు
నటుడు విశాల్ తమిళ నిర్మాతల మండలి పెద్ద షాక్ ఇచ్చింది. నిర్మాతల మండలిలో ఆయన సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాల్ నటుడిగా, నిర్మాతగా, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా కేరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈయన గత ఆగస్ట్ 17వ తేదీన ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ నిర్మాతల మండలి కార్యవర్గ చర్యలపై ఆరోపణలు చేసినట్లు కథనాలు వెలువడి పెద్ద చర్చకే దారి తీశారుు. అంతే కాదు తమిళ నిర్మాత మండలి కార్యవర్గంలోనూ కలవరాన్ని రేకెత్తించారుు. విశాల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నిర్మాతల మండలి ఆయనపై చర్యలకు సిద్ధమైంది.
కాగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో విశాల్ చేసిన ఆరోపణలపై చర్చించిన నిర్మాతల మండలి ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్మాతల మండలి ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో.. విశాల్ ఆరోపణలు సంఘం నియమ నిబంధనలను, సంఘటితను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ విశాల్‌కు సెప్టెంబర్ 2న లేఖ పంపినట్టు తెలిపారు. అందుకు ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తినివ్వకపోవడంతో విశాల్‌ను మండలి సభ్యుత్వం నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలానికే దారి తీస్తోందన్నది గమనార్హం. కాగా నడిగర్ సంఘం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్ త్వరలో జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ కార్యదర్శి పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే ప్రచారం హోరెత్తుతున్న నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.