కేంద్రప్రభుత్వానికి తమిళ చిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించి శనివారం ఆ మండలి నిర్వాహకులు ఒక ప్రకటన మీడియాకు విడుదల చేశారు. అందులో పైరసీతో భారతీయ సినిమా నానాటికీ నశించిపోతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాంతీయ భాషా చిత్రాల్లో వ్యాపార రీత్యా, ఉన్నత విలువలతో కూడిన చిత్రాలను అందించడంలో ముందుండే తమిళ సినిమా రంగాన్ని రక్షించడానికి ఈ యాక్ట్ దోహదం చేస్తుందన్నారు.
సెక్షన్ 6ఏ ఆఫ్ ది సినిమాటోగ్రాఫ్ యాక్ట్ చట్టానికి గానూ యావత్ సినీ పరిశ్రమ తరఫున నిర్మాతల మండలి తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదికి నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ధన్యవాదాలు తెలుపారు. అదే విధంగా సింగిల్ విండో సిస్టం పేరుతో చిత్రపరిశ్రమ ఫలం పొందేలా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక 28 శాతంగా ఉన్న జీఎస్‌టీ పన్నును సినీరంగం కోసం 18 శాతానికి తగ్గించడానికి కృషి చేసిన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పొన్.రాధాకృష్ణన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment