దేశవ్యాప్తంగా ఒకే టాక్స్ విధానం అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు సినీ నిర్మాతల మండలి ప్రధాన సలహాదారుడు టి.రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సినిమాలకు వీపీఎఫ్ (వర్చువల్ ప్రిట్ ఫీ) తగ్గించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు సినీ నిర్మాతల మండలి తరఫున బుధవారం స్థానిక వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీపీఎఫ్ టాక్స్ తగ్గించాలని గత రెండేళ్లుగా కోరుతున్నామన్నారు.
అయితే ఇప్పటి వరకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము థియేటర్లకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, అయితే వీపీఎఫ్ టాక్స్ అనేది క్యూబ్ సంస్థలకు, థియేటర్ల యాజమాన్యానికి సంబంధించిన విషయమన్నారు. ఇందులో నిర్మాతలకు సంబంధంలేదని అలాంటి వారిని టాక్స్ చెల్లించమనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అదేవిధంగా ఎల్‌బీటీ (లోకల్ బాడీ టాక్స్)ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment