lbt
-
నిర్మాతలకు సంబంధం లేకపోయినా టాక్స్ చెల్లించాలా?
దేశవ్యాప్తంగా ఒకే టాక్స్ విధానం అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు సినీ నిర్మాతల మండలి ప్రధాన సలహాదారుడు టి.రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సినిమాలకు వీపీఎఫ్ (వర్చువల్ ప్రిట్ ఫీ) తగ్గించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు సినీ నిర్మాతల మండలి తరఫున బుధవారం స్థానిక వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీపీఎఫ్ టాక్స్ తగ్గించాలని గత రెండేళ్లుగా కోరుతున్నామన్నారు. అయితే ఇప్పటి వరకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము థియేటర్లకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, అయితే వీపీఎఫ్ టాక్స్ అనేది క్యూబ్ సంస్థలకు, థియేటర్ల యాజమాన్యానికి సంబంధించిన విషయమన్నారు. ఇందులో నిర్మాతలకు సంబంధంలేదని అలాంటి వారిని టాక్స్ చెల్లించమనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అదేవిధంగా ఎల్బీటీ (లోకల్ బాడీ టాక్స్)ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. -
బడ్జెట్లో నో ఎల్బీటీ
- స్పష్టం చేసిన మంత్రి గిరీష్ బాపట్ - పరిశ్రమలు, వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడి పింప్రి, న్యూస్‌లైన్: వ్యాపారుల ఆర్థిక సమస్యల దృష్ట్యా ఈ సారి బడ్జెట్లో స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) ఉండదని, భవిష్యత్తులో కూడా దీని ప్రస్తావన ఉండదని పౌర సరఫరాల శాఖ మంత్రి గిరీష్ బాపట్ స్పష్టం చేశారు. పింప్రి-చించ్వడ్ చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కామర్స్, సర్వీసెస్ అండ్ అగ్రికల్చరల్ ఆధ్వర్యంలో గురువారం ఆటో క్లస్టర్ సభా గృహంలో ‘మేక్ ఇన్ మహారాష్ట్ర-మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుణే నగరంలో పరిశ్రమలకు, వ్యాపారుల సమస్యలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎంఐడీసీలో పరిశ్రమల, వ్యాపార మేళాలు ప్రారంభిస్తామని, అందులో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించవచ్చని అన్నారు. విద్యుత్, అగ్నిమాపక కేంద్రాలు సహా 50 రకాల సమస్యలు గుర్తించామని, వీటిలో కీలక సమస్యల్ని వచ్చే ఏడాదిలోగా పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ గజానన్ బాబర్, పింప్రి-చించ్వడ్ చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీజ్, కామర్స్, సర్వీసెస్ అండ్ అగ్రికల్చరల్ అధ్యక్షుడు, అడ్వొకేట్ అప్పాసో షిందే, ఉపాధ్యక్షుడు ప్రేమ్‌చంద్ మిత్తల్, సభ్యులు సురేశ్ వాడేకర్, వినోద్ బన్సల్, పింప్రి-చించ్వడ్ పరిశ్రమల సంఘటన అధ్యక్షుడు నితిన్ బన్కర్ తదితరులు హాజరయ్యారు. -
ఎల్బీటీ చెల్లించకపోతే కఠిన చర్యలు
ఎస్ఎంసీ కమిషనర్ చంద్రకాంత్ గూడేంవార్ సాక్షి, ముంబై: స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) చెల్లించని వారిపై చర్యలు తప్పవని షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) కమిషనర్ చంద్రకాంత్ గూడేంవార్ హెచ్చరించారు. పట్టణానికి చెందిన అనేక మంది వ్యాపారులు ఎల్బీటీ చెల్లించలేదు. ఈ విషయమైం చంద్రకాంత్ గూడేంవార్ శనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హాలులో ఓ వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ సుశీల అయాటే, ఫ్లోర్ లీడర్ సంజయ్ హేమగడ్డి, కార్పొరేషన్ పదాధికారులతోపాటు అనేక మంది వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ అనేక మంది వ్యాపారులు ఎల్బీటీ చెల్లించడంలేదన్నారు. కార్పొరేషన్‌కు ప్రతి నెల సుమారు 20వ తేదీవరకు రూ. 50 లక్షల వరకు ఎల్బీటీ రూపంలో ఆదాయం కార్పొరేషన్‌కు వచ్చేదన్నారు. అయితే గతకొంత కాలంగా ఎవరూ చెల్లించకపోవడంతో రాబడి బాగా తగ్గిపోయిందన్నారు. ఈ విషయంపై అనేక పర్యాయాలు హెచ్చరించామని, అయినప్పటికీ స్పందన కరువైందన్నారు. అందువల్ల ఈ నెల 20వ తేదీలోగా వ్యాపారులంతా ఎల్బీటీ చెల్లించాలని సూచించారు. ఇకపై ఎల్బీటీ చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిమానా కూడా వసూలు చేయనున్నట్టు తెలిపారు. ఎల్బీటీ చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్వేర్: వ్యాపారులంతా ఇళ్లు, కార్యాలయాల నుంచే ఎల్బీటీ చెల్లించేవిధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) రూపొందించినట్టు చంద్రకాంత్ పేర్కొన్నారు. ఈ సాఫ్ట్వేర్ గురించి తెలియజేసేందుకు ఈ వర్క్‌షాపు నిర్వహించామన్నారు. దీంతో సునాయాసంగా ఆన్‌లైన్‌ద్వారా ఎల్బీటీ చెల్లిచేందుకు వీలవుతుందన్నారు.