తెలుగులో విడుదలకానున్న 'బ్లడీ బెగ్గర్‌' | Bloody Beggar Telugu Version Rights Taken By Asian Suresh Films, Check Out For Release Date | Sakshi
Sakshi News home page

Bloody Beggar Telugu Release: తెలుగులో విడుదలకానున్న 'బ్లడీ బెగ్గర్‌'

Nov 4 2024 9:03 AM | Updated on Nov 4 2024 10:02 AM

Bloody beggar Telugu Version Rights Take Asian Suresh Films

కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ కథానాయకుడిగా కొనసాగుతున్న యువ నటులలో కవిన్‌ ఒకరు. ఈయన డాడా, స్టార్‌ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం బ్లడీ బెగ్గర్‌ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా శివబాలన్‌ ముత్తుకుమార్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తన మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టి సత్తా చాటారు. ఈయన గతంలో బీస్ట్‌, జైలర్‌ చిత్రాల దర్శకుడు నెల్సన్‌కు మెచ్చిన శిష్యుడు. దీంతో తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నెల్సన్‌నే నిర్మాతగా మారి ఫిలమెంట్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

కోలీవుడ్‌లో విడుదలైన బ్లడీ బెగ్గర్‌ సినిమాకు మంచి రివ్యూలే ఎక్కువగా వచ్చాయి. విరమర్శకుల నుంచి సైతం ప్రశంసలు ఈ మూవీకి అందాయి. ముఖ్యంగా హీరో కవిన్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. నవంబర్‌ 7న ఏసియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారు ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement