
నయనతార వయసు 39 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇప్పటికీ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. కాదు కాదు ఛాన్సులు వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు.. తమకు స్టార్ హోదా రాగానే భూమ్మీద నిలబడరు. ఎక్కడికో వెళ్లిపోతారు. ఇలాంటి టైంలోనూ నయనతారకు అసలు ఇన్ని ఛాన్సులు ఎలా వస్తున్నాయి? అసలు ఆమె ఏం ఫాలో అవుతోంది?
(ఇదీ చదవండి: Love Me If You Dare: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)
టాలీవుడ్ హీరోయిన్లనే తీసుకోండి. ఒక్కసారి స్టార్ హీరోయిన్ అయిపోతే ఇక చిన్న సినిమాలు చేయడానికి అస్సలు ఆసక్తి చూపించరు. మ్యునరేషన్ అమాంతం పెంచేస్తారు. నయన్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 'జవాన్' లాంటి మూవీతో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టినా సరే తమిళంలో లోకల్ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. హిట్, ఫ్లాప్ అనేది పక్కనబెడితే లోకల్ నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది.
కొన్నాళ్ల క్రితం అథర్వ అనే చిన్న హీరోతో కలిసి సినిమా చేసింది. ఇప్పుడు కవిన్ అని మరో యంగ్ హీరోతో కలిసి ఇప్పుడు నటించబోతుందట. లోకేశ్ కనగరాజ్ శిష్యుడు విష్ణు ఎడవన్.. ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే మిగతా హీరోయిన్లతో పోలిస్తే అన్ని రకాల సినిమాలు చేస్తుండటమే ఈమె సక్సెస్ సీక్రెట్ అయ్యిండొచ్చు.
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ)