గత 20 ఏళ్లలో ఎందరో నటీమణులు దక్షిణాది చిత్ర పరిశ్రమలో వచ్చారు, వస్తున్నారు కూడా. వారిలో కొందరు అగ్ర నాయకిలుగా రాణిస్తున్నారు. అయితే వీరందరిలో ప్రత్యేకత చాటుకుంటున్న నటి మాత్రం నయనతారనే అని చెప్పక తప్పదు. మలయాళీ బ్యూటీ ఆరంభ కాలంలో పలు అవమానాలను, ఆవేదనలు, కష్టాలను చవి చూసినా ఆ తర్వాత మాత్రం చాలా వేగంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. నిజానికి ప్రేమలో ఓడిపోవడం, పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గటం వంటివి కథానాయకిల జీవితాల్లో సహజంగా జరుగుతుంటుంది. అయితే ఈ రెండు విషయాలు నయనతారను కథానాయకిగా మరింత ఎదగడానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు.
శింబు, ప్రభుదేవలతో ప్రేమాయణం, విడిపోవడాలు వంటి ఘటనలు జరిగినప్పటికీ నయనతార మాత్రం అగ్రస్థాయికి ఎదిగారు. ఇప్పుడు నయనతార అంటే కేవలం హీరోయిన్ మాత్రమే కాదు. ఒక లేడీ సూపర్ స్టార్. ఒక సక్సెస్ ఫుల్ నిర్మాత. ఒక స్టార్ వ్యాపారవేత్త. అదేవిధంగా వాణిజ్య ప్రకటనల కోసం దక్షిణాదిలోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటి. జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వకముందు దక్షిణాదిలో చిత్రానికి రూ. 5 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునేవారని ప్రచారంలో ఉంది. అలాంటిది హిందీలో జవాన్ చిత్రంలో నటించిన తర్వాత దక్షిణాది చిత్రాలలోనూ ఈ అమ్మడు రూ.10 కోట్లు ఇస్తేనే నటిస్తానని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
మరో విషయం ఏమిటంటే నయనతార ఒక 50 సెకండ్ల వాణిజ్య ప్రకటనలో నటించటానికి రూ. 5 కోట్లు తీసుకున్నారన్నది తాజా సమాచారం. ఒక చిత్రానికి నెలంతా కాల్ షీట్స్ కేటాయించి పొందే పారితోషికానికి సమానంగా 50 సెకండ్లు కనిపించే ప్రకటనలో పొందడం అన్నది బహుశా దక్షిణాదిలోనే ఏకైక నటి నయనతార కావచ్చు. ఈమెకు ఇంత పారితోషికం చెల్లించింది డీటీహెచ్ సంస్థ అయిన టాటా స్కై అని సమాచారం. కొన్ని నెలల నుంచి ఆ సంస్థ సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా నయన్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment