
నయనతార, శింబు లీడ్ రోల్స్‌లో నటించిన ‘వల్లభ’ (2006) సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో స్టూడెంట్ వల్లభ (శింబు),ప్రోఫెసర్ స్వప్న (నయనతార) ప్రేమించుకుంటారు. ఇప్పుడు ‘వల్లభ’ సినిమా ప్రస్తావన ఎందుకంటే ఈ తరహాలోనే తనకంటే చిన్న వయస్కుడితో ప్రేమలో పడే కథకు నయనతార మళ్లీ పచ్చజెండా ఉపారని కోలీవుడ్‌లో వినిపిస్తోంది. నయనతార, కెవిన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కనున్న చిత్రకథాంశం ఇది అని టాక్.
దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో కలిసి ఓ తమిళ సినిమాకు లిరిక్స్ అందించిన విష్ణు ఎడ్వాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ నెల 22న ్రపారంభించాలని చిత్రయూనిట్ అనుకుంటోందట. ఈ సినిమాలో తనకంటే చిన్నవాడైన ఓ అబ్బాయిని ఇష్టపడుతుందట ఓ అమ్మాయి. ఆ అబ్బాయి కూడా ఆమెతో ప్రేమలో పడతాడట. ఆ తర్వాత ఈ ఇద్దరూ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? అనే అంశాలను వినోదాత్మకంగా చూపించనున్నారట దర్శకుడు.
సీక్వెల్ రెడీ... నయనతార, ఆర్‌జే బాలాజీ నటించిన ఆధ్యాత్మిక చిత్రం ‘ముకుత్తి అమ్మన్ ’ (2020). ఆర్‌జే బాలాజీ, ఎన్ జే శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాగా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్ అంశం తెరపైకి వచ్చింది. ‘ముకుత్తి అమ్మన్ 2’లో నయనతార ఓ లీడ్ రోల్‌లో నటించనున్నట్లుగా వేల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ సంస్థ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే దర్శకుణ్ణి మాత్రం ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment