‘అలయాన్‌’కోసం ఐదేళ్లు వెయిట్‌ చేశా.. హీరో శివ కార్తికేయన్ | Siva Karthikeyan Talk About Ayalaan Movie | Sakshi
Sakshi News home page

Siva Karthikeyan: ‘అలయాన్‌’లో 4500 వీఎఫెక్స్‌ షాట్స్ .. థీమ్ పార్క్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది

Published Wed, Jan 24 2024 7:19 PM | Last Updated on Wed, Jan 24 2024 7:22 PM

Siva Karthikeyan Talk About Ayalaan Movie - Sakshi

సంక్రాంతికి తెలుగులో చాలా సినిమాలు ఉండటంతో  మా సినిమా(అలయాన్‌)ను విడుదల చేయలేదు. రెండు వారాలు ఆలస్యంగా వచ్చినా విజయం సాధిస్తుందని నమ్మాను. 'లవ్ టుడే', 'విడుదలై', విశాల్ 'అభిమన్యుడు' సినిమాలు తమిళంలో విడుదలైన తర్వాత తెలుగులో విడుదలై హిట్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే ఆడుతుంది. సినిమా కోసం ఐదేళ్లు వెయిట్ చేశా. రెండు వారాలు పెద్ద సమస్య కాదు’అని హీరో శివకార్తికేయన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అయలాన్‌’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం.. తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా జనవరి 26న రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

'అయలాన్' సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. నేను ఓ హీరో అయితే‌... మరొక హీరో ఏలియన్. ఈ  సినిమాలో 4500 వీఎఫెక్స్‌ షాట్స్ ఉన్నాయి. రోబో, 2.ఓ సినిమాల్లో కంటే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రం ఇది. మా బడ్జెట్ తక్కువ. పరిమిత నిర్మాణ వ్యయంలో గనుక సినిమా తీయగలిగితే మరింత పెద్ద కలలు కనవచ్చు అని అనిపించింది. అందుకే ఎక్కువ రోజులు పట్టిన తప్పకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న చిత్రమిది. హ్యూమన్ ఏలియన్ మధ్య ఇంటరాక్షన్ అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మా సినిమా తమిళనాడులో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మా ప్రయత్నాన్ని అభినందిస్తారని చెప్పగలను.

'అయలాన్'లో 90 శాతం సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. 70 శాతం సినిమాలో ఏలియన్ ఉంది. మెజారిటీ సినిమా అంతా విజువల్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 200, 300 కోట్ల బడ్జెట్ ఉంటే తప్ప ఇటువంటి సినిమా చేయలేం. సరైన టీమ్, ఐడియా ఉంటే తక్కువ బడ్జెట్ లో కూడా చేయవచ్చు. ఇది హిట్ అయితే ఎక్కువ బడ్జెట్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. అప్పుడు మేం ఇంకా పెద్ద కల కనొచ్చు. మమ్మల్ని మోటివేట్ చేసిన అంశం అదే.

నేను రెహమాన్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నా సినిమాకు సంగీతం అందించాలనేది బిగ్గెస్ట్ డ్రీం. ఈ సినిమాతో రవికుమార్ ఐడియా కారణంగా అది కుదిరింది. ఆయన మాకు ఎంతో మోటివేషన్ ఇచ్చారు. లాస్ట్ సెకండ్ వరకు వర్క్ చేశారు. నేను ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందని రెహమాన్ చెప్పారు. తెలుగులో విడుదలకు రెండు వారాలు టైమ్ ఉండటంతో మ్యూజిక్ పరంగా కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశారు.

'అయలాన్' సీక్వెల్‌ ఐడియా ఉంది. ఏలియన్ క్రియేట్ చేయడానికి మేం చాలా రీసెర్చ్ చేశాం. ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాం. సీక్వెల్ ఐడియా మాకు ముందు నుంచి ఉంది. సీక్వెల్ ఇంకా బిగ్గర్ స్కేల్ లో చేస్తాం. తమిళనాడులో సక్సెస్ మమ్మల్ని మోటివేట్ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement