తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన తమిళ్‌లో నటించిన రెమో, డాక్టర్ వరుణ్, డాన్, ప్రిన్స్ చిత్రాలు తెలుగులో విడుదలైన మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇటీవలే ‘అయలాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలుగులో విడుదల కాబోతుంది.
(చదవండి: అయోధ్యకు జూ ఎన్టీఆర్, ప్రభాస్ వెళ్లకపోవడానికి కారణం ఇదేనా?)
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ త్వరలోనే స్ట్రీమింగ్ చేయనుందట. ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజు రిలీజ్ కానున్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయలాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది.
ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment