‘‘యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘అయలాన్’. సినిమాలా ఉండదు.. థీమ్ పార్క్‌లోకి వెళ్లినట్టు, జాలీ రైడ్‌లా ఉంటుంది. రెండున్నర గంటలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మా సినిమా తమిళనాడులో భారీ విజయం సాధించింది. తెలుగులోనూ సూపర్ హిట్టవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో శివ కార్తికేయన్. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘అయలాన్’. కోటపాడి జె.
రాజేష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న తమిళంలో విడుదలైంది. తెలుగులో మహేశ్వర్ రెడ్డి ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శివకార్తికేయన్ మాట్లాడుతూ– ‘‘అయలాన్’ షూటింగ్ కోవిడ్‌కి ముందే పూర్తి చేశాం. కరోనా వల్ల విజువల్ ఎఫెక్ట్స్ చేయడం కుదరలేదు. ‘రోబో, 2.ఓ’ సినిమాల్లో కన్నా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రమిది. ‘అయలాన్’లో నేనో హీరో అయితే ఏలియన్ మరో హీరో. అయలాన్’ సీక్వెల్‌ని ఇంకా భారీగా చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment