
తమిళసినిమా: తనకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే అంటూ మొదలెట్టింది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి కథానాయకిగా రాణిస్తున్న భామల్లో ఈ బ్యూటీ ఒకరు. నిన్నటి వరకూ టాలీవుడ్‌లో అగ్ర నటిగా వెలిగిన ఈ అమ్మడు ఇప్పుడు పూర్తిగా కోలీవుడ్‌నే నమ్ముకుంది. కారణం తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకనో కాస్త దూరంగా పెట్టింది. అయితే మళ్లీ అక్కడ పుంజుకునే ప్రయత్నం చేస్తోందనుకోండి. ఎన్‌టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో మెరవనుందనే ప్రచారం జోరందుకుంది. ఇకపోతే తమిళంలో ప్రస్తుతం చేతిలో మూడు చిత్రాలున్నాయి. వాటిలో సూర్యతో జతకట్టిన ఎన్‌జీకే చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. దీపావళికి తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.
ప్రస్తుతం కార్తీకి జంటగా ఒక చిత్రం, శివకార్తికేయన్‌తో చేస్తున్న చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఒక హింది చిత్రంలోనూ నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో మాట్లాడుతూ కొందరు నటీమణులు సినిమారంగంలో నటీమణులకు రక్షణ లేని పరిస్థితి అని అంటున్నారని, అయితే తాను మాత్రం అలా భావించడం లేదని అంది. తనతో అందరూ మంచి మిత్రులానే ప్రవర్తిస్తున్నారని చెప్పింది. అదే విధంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు. ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు అని చాలా మంది అడుగుతున్నారని అంది. నన్ను పెళ్లి చేసుకోబోయే వాడు పేదవాడైనా పర్వాలేదు గానీ, మంచి మనసున్నోడై ఉండాలని, నన్ను ప్రేమించేవాడై ఉండాలని చెప్పింది. ముఖ్యంగా తన ఎత్తు 5అడుగులని, అతను కనీసం 6 అడుగులవాడైనా అయి ఉండాలని రకుల్ పేర్కొంది. ఇంతకీ పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు అయినప్పుడే అంటూ సమాధానాన్ని దాటేసింది.
Comments
Please login to add a commentAdd a comment