
తమిళసినిమా: నటుడు శివకార్తీకేయన్‌తో ప్రముఖ దర్శకుడి వారసురాలు జత కట్టే అవకాశాన్ని దక్కించుకుందా? దీనికి అలాంటి అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. నటుడు శివకార్తీకేయన్ వరుస విజయాలతోనే కాదు, చేతి నిండా చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం నటిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం మే 1వ తేదీన విడుదల కానుంది. ఇది ఆయన 13వ చిత్రం. కాగా 14వ చిత్రంగా ఇండ్రు నేట్రు నాలై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో నటి రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిగా నటించనుంది. దీని తరువాత ఇరుంబుతిరై చిత్రం ఫేమ్ పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఇది శివకార్తీకేయన్‌కు 15 చిత్రం అవుతుంది. ఇందులో వర్థమాన నటి కల్యాణికి హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. ఈమె ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురన్నది గమనార్హం. ఇప్పటికే తెలుగులో అఖిల్ సరసన హలో అనే చిత్రంలో నటించిన ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రంలో శర్వానంద్‌తో నటిస్తోంది. అదే విధంగా మలయాళంలో రెండు చిత్రాలు, తమిళంలో వాన్ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. అయితే ఇంకా ఈ బ్యూటీ నటించిన ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment