అమరన్‌కి ప్రశంసలు | Superstar Rajinikanth appreciates team Amaran | Sakshi
Sakshi News home page

అమరన్‌కి ప్రశంసలు

Published Sun, Nov 3 2024 3:30 AM | Last Updated on Sun, Nov 3 2024 11:50 AM

Superstar Rajinikanth appreciates team Amaran

శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘అమరన్‌’. ఈ చిత్రబృందాన్ని హీరో రజనీకాంత్‌ ప్రశంసించారు. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించారు. కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్‌ చేశారు. కాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘అమరన్‌’ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. 

ఆ తర్వాత కమల్‌హాసన్‌కు ఫోన్‌ చేసి, అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే హీరో శివ కార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్, నిర్మాత ఆర్‌. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్‌ సాయిలని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకథ, కథనం, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నాయని రజనీకాంత్‌ ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement