తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ 'అయలాన్'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. అయితే తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ల సమస్య వల్ల తెలుగు వెర్షన్ విడుదల వాయిదా వేసుకున్నారు. అయితే విడుదలకు ముందు హీరో శివకార్తికేయన్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. అలానే తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్స్ బాగానే సాధించినట్లు తెలుస్తోంది.
శివకార్తికేయన్, రకుల్ జంటగా నటించిన ఈ సినిమాకు రవికుమార్ దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీంతమందించాడు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ మాట్లాడుతూ..'అయలాన్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఇలాంటి సినిమాల్ని తీయాలంటే శంకర్, ఆ తర్వాత రవికుమారే అని చెప్పొచ్చు. అలాంటి దర్శకుడిని ప్రోత్సహించాలన్నారు.
(ఇదీ చదవండి: ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు కాదు.. దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
'అలానే 'అయలాన్' సినిమాకు కచ్చితంగా సీక్వెల్ కూడా ఉంటుందని శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే తమిళంలో 'అయలాన్' సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా చూసేలా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.11 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం. మరి తెలుగు వెర్షన్ రిలీజ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ తమిళంలో రిలీజైన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమాని.. తెలుగులో జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 'అయలాన్' కూడా అప్పుడే వస్తుందా లేదా అనేది క్లారిటీ రావాలి.
(ఇదీ చదవండి: క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్)
Comments
Please login to add a commentAdd a comment