Ayalaan: ఏలియన్ మూవీ.. ఏకంగా దుబాయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ | Sivakarthikeyan Ayalaan Movie Trailer Launch Event In Dubai, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Ayalaan Movie Updates: ఏలియన్ మూవీ.. ఏకంగా దుబాయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Published Tue, Dec 26 2023 8:55 AM | Last Updated on Tue, Dec 26 2023 9:53 AM

Sivakarthikeyan Ayalaan Movie Trailer Launch Event In Dubai - Sakshi

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌ చేస్తున్న కొత్త సినిమా 'అయలాన్'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. కేసీఆర్‌ స్టూడియోస్‌, 24 ఏఎం స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సోషియో సైంటిఫిక్‌ కథతో తీసిన ఈ చిత్రానికి రవికుమార్‌ దర్శకుడు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 2018లోనే ప్రారంభమైంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణంలో ఉంది. మొన్న దీపావళికే సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు కానీ కుదర్లేదు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే)

అయితే గ్రాఫిక్స్‌ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని సంక్రాంతి/పొంగల్‌కి వాయిదా వేశారు. ఇప్పుడీ మూవీ జనవరిలోనైనా వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర నిర్మాతలు ఇంకా స్పందించలేదు. కానీ ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 7న దుబాయిలో భారీ ఎత్తున చేయబోతున్నట్లు సమాచారం. 

(ఇదీ చదవండి: మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కటిగా కనిపించిన ఆ ఇద్దరు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement