
వాండు చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు శివకార్తికేయన్ ఆవిష్కరించారు.
సాక్షి, తమిళ సినిమా: వాండు చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు శివకార్తికేయన్ ఆవిష్కరించారు. ఎంఎం.పవర్ సినీ క్రియేషన్స్ పతాకంపై వాసన్‌షాజీ, డట్టో.ఎన్. మునియాండి నిర్మిస్తున్న చిత్రం వాండు. దీనికి వాసన్ షాజీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన వివరిస్తూ ఇది 1970-71 ప్రాంతంలో ఉత్తర చెన్నైలోని స్లమ్ ఏరియాలో అనుమతి లేని వీధి పోరాటాలు నేపథ్యంలో సాగే యథార్థ సంఘటనల కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ముష్టి యుద్ధంలా సాగే ఆ పోరాటాలను చూసి స్ఫూర్తి పొందిన ఒక స్లమ్ ఏరియాకు చెందిన కుర్రాడు ఎలా ట్రయినింగై మాస్టర్ అయ్యాడో తెలిపే పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా వాండు ఉంటుందన్నారు.
ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించడానికి పలువురు ప్రముఖ హీరోలను కోరగా వారున్న బిజీ షెడ్యూల్‌లో అంగీకరించలేక పోయారన్నారు. అలాంటి సమయంలో నటుడు శివకార్తికేయన్ తన వేలైక్కారన్ చిత్ర డబ్బింగ్ పనులు, మరో పక్క పొన్‌రామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్ర షూటింగ్ అంటూ చాలా బిజీగా ఉన్నా తాను కలిసి వాండు చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించాల్సిందిగా కోరగా వెంటనే అలాగే అని పోస్టర్ ఆవిష్కరించి తమ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారని తెలిపారు. ఆయన శుభాకాంక్షలనే తమ చిత్ర తొలి విజయంగా భావిస్తున్నామని దర్శకుడు వాసన్ షాజీ పేర్కొన్నారు.