
'మహావీరుడు', 'అయలాన్' సినిమాలతో హిట్స్ కొట్టిన తమిళ హీరో శివకార్తికేయన్.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటిలో కమలహాసన్ నిర్మిస్తున్న 'అమరన్' ఒకటి. దీని షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తీస్తున్న మూవీ షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోంది.
(ఇదీ చదవండి: నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య)
ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ ఎలాంటి ఆర్భాటం లేకుండా అయిపోయింది. ప్రస్తుతం పుదుచ్చేరిలో రెండో షెడ్యూల్ జరుగుతోంది. అనిరుధ్ సంగీతమందిస్తుండగా.. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. ఈ మూవీ తర్వాత మురగదాస్.. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తారు.
(ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?)
Comments
Please login to add a commentAdd a comment