
నటుడు శివకార్తికేయన్ గుడ్ నైట్ చిత్ర దర్శకుడితో చేతులు కలపనున్నారని సమాచారం. శివ కార్తికేయన్ ప్రతిభ కలిగిన యువ దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటున్నారు. అలా రామ్ కుమార్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన అయలాన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కమలహాసన్ తన రాజకమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను.
రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తునానరు. ఇది శివకార్తికేయన్‌కు 21 చిత్రం. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో శివకార్తికేయన్ తదుపరి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ నాయకిగా నటించబోతున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది.
తాజా సమాచారం ఏమిటంటే ఇటీవల గుడ్ నైట్ అనే చిన్న చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్. ఈయన తదుపరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించనున్నట్లు తెలిసింది. వినాయక్ చంద్రశేఖరన్ చెప్పిన కథ నచ్చడంతో అందులో నటించడానికి శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment