కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న అమరన్ థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది.
తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.21 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ రోజు తమిళనాడులో సెలవుదినం కావడంతో రెండో రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. తమిళ వర్షన్‌లో మొదటి రోజు థియేటర్లలో 77.94 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన అమరన్ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. అయితే విజయ్ ది గోట్, రజనీకాంత్ వేట్టయాన్ చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. అయితే తమిళనాడులో కమల్ హాసన్ చిత్రం ఇండియన్ -2 ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను దాటేసింది. కాగా.. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తక ఆధారంగా తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment