![Ayalaan Movie Telugu Version Release Date Details - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/17/ayalaan-movie-telugu.jpg.webp?itok=bX6qb4lr)
తమిళ హీరో శివ కార్తికేయన్.. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించాడు. ఇతడు హీరోగా నటించిన 'అయలాన్'.. సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజైంది. థియేటర్ల దొరక్క తెలుగు వెర్షన్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రానికి తెలుగు రిలీజ్ డేట్ తాజాగా ఫిక్స్ చేశారు.
(ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?)
అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో హిట్ టాక్ తెచ్చుకున్న 'అయలాన్'.. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లాంగ్ రన్‌లో రూ.100 కోట్లకు చేరువ కావొచ్చు.
ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తీసిన 'అయలాన్'లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. పేరుకే సైన్స్ ఫిక్షన్ మూవీ అయినప్పటికీ ఫ్యామిలీస్‌కి నచ్చే కామెడీ, ఎమోషన్స్ సినిమాలో చాలా ఉన్నాయని అంటున్నారు. మరి తెలుగులో ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!)
Comments
Please login to add a commentAdd a comment