స్టార్ హీరో సినిమాకు చేదు అనుభవం ఎదురైంది. తెలుగులో రిలీజ్ వరకు అంతా సిద్ధం చేశారు. ప్రమోషన్స్ కూడా నిర్వహించడంతో కాస్తంత హైప్ వచ్చింది. కానీ చివరకొచ్చేసరికి మొత్తం సీన్ మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో షోలన్నీ క్యాన్సిల్ చేసి పడేశారు. దీంతో ఎంతో ఆశతో థియేటర్లకు వెళ్లిన జనాలు షాకయ్యారు. పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగింది? ఎందుకు క్యాన్సిల్ చేశారు?
(ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి)
ఈ సంక్రాంతి బరిలో తెలుగులో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. 'హనుమాన్'.. పండగ విజేతగా నిలిచింది. ఇకపోతే మహేశ్, నాగార్జున, వెంకటేశ్ సినిమాలు అనుకున్నంత రీతిలో జనాలకు నచ్చలేదు. మరోవైపు సంక్రాంతి బరిలోనే 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' లాంటి డబ్బింగ్ చిత్రాలని కూడా తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ థియేటర్ల సమస్య కారణంగా ఈ రెండు చిత్రాల్ని జనవరి 26కి వాయిదా వేసుకున్నారు.
వీటిలో ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. మరోవైపు శివకార్తికేయన్ 'అయలాన్' కూడా థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేసి, టికెట్లు అన్నీ కూడా సేల్ చేశారు. తీరా థియేటర్ల దగ్గరికి వెళ్తే.. షోలని క్యాన్సిల్ చేసినట్లు చావు కబురు చల్లగా చెప్పారు. అయితే ఏదో ఫైనాన్సిల్ ప్రాబ్లమ్ వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజులో ఈ సమస్యని పరిష్కరిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ))
Comments
Please login to add a commentAdd a comment