స్టార్ హీరో సినిమాలో ఏలియన్.. టీజర్ అదిరిపోయింది! | Ayalaan Teaser Telugu Siva Karthikeyan | Sakshi
Sakshi News home page

Ayalaan Teaser: ఏలియన్ మూవీనే కానీ కామెడీ నుంచి డ్యాన్స్ వరకు!

Oct 6 2023 7:56 PM | Updated on Oct 6 2023 8:17 PM

Ayalaan Teaser Telugu Siva Karthikeyan - Sakshi

సినిమాల్లో ఎన్ని జానర్స్ ఉన్నా సైన్స్ ఫిక్షన్ అనేది మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ తరహా చిత్రాల్ని కరెక్ట్‌గా తీస్తే ప్రేక్షకుల్ని నుంచి వేరే లెవల్ రెస్పాన్స్ వస్తుంది. ఈ జానర్ లో డిఫరెంట్ మూవీస్ తీసినప్పటికీ ఏలియన్ కాన్సెప్ట్ మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు స్టార్ హీరో ఏలియన్ స్టోరీతో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఏ మూవీ? దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: 'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?)

ఇప్పుడున్న హీరోల్లో శివకార్తికేయన్ సమ్‌థింగ్ డిఫరెంట్. చాలా సాధారణమైన స్టోరీల్ని కూడా తనదైన కామెడీతో హిట్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపించే ఇతడు.. ఈ ఏడాది 'మహావీరుడు' చిత్రంతో హిట్ కొట్టాడు. ఇప్పుడు 'అయాలన్' అనే ఏలియన్ సినిమాతో అలరించేందుకు సిద్ధమైపోయాడు. సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు.

ఓ పల్లెటూరిలో కుర్రాడు (శివకార్తికేయన్), అనుకోకుండా ఆ ఊరిలోకి వచ్చిన ఏలియన్ తో ఫ్రెండ్‌షిప్ చేయడం.. వీళ్లిద్దరూ కలిసి కామెడీ చేస్తూనే మరోవైపు ఓ సీరియస్ విషయాన్ని సాల్వ్ చేయడం లాంటి వాటిని టీజర్‌లో చూడొచ్చు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ కూడా క్రేజీగా ఉంది. టీజర్ చూస్తుంటే హిట్ పక్కా అనిపిస్తుంది. మరి తెలుగు ఆడియెన్స్‌కి ఎంతవరకు ఎక్కుతుందనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement