
సీరియల్ బ్యూటీస్.. సినిమాల్లోకి రావడం కొత్తేం కాదు. తెలుగు లేదంటే తమిళం ఇలా ఏ భాషలో తీసుకున్నా సరే మూవీస్లో వీళ్లకు సహాయ పాత్రలు మాత్రమే దక్కుతుంటాయి. కానీ ప్రధాన పాత్రల్లో నటించే ఛాన్సులు దక్కేది చాలా తక్కువ. అలా ఇప్పుడు సీరియల్ కమ్ బిగ్‌బాస్ బ్యూటీ.. సినిమాలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. దీని గురించి చెబుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)
'శరవణన్ మీనాక్షి' సీరియల్ ద్వారా నటి రచిత మహాలక్ష్మి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు ఇప్పుడు తమిళంలో తీస్తున్న 'ఎక్స్‌ట్రీమ్' చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. రాజవేల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం లాంఛనంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమైంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ మూవీ ఇతర నటీనటుల వివరాలు, విడుదల తేదీన త్వరలో వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలియజేశాడు.
(ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?)
Comments
Please login to add a commentAdd a comment