
తమిళ యంగ్ డైరెక్టర్ సంతోష్ పి.జయకుమార్ కొత్త సినిమాకు 'ద బాయ్స్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ దర్శకుడే ఇందులో హీరోగా నటిస్తుండటం విశేషం. డార్క్ రూమ్ పిక్చర్స్, నోవా ఫిలిం స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో 'జైలర్' హర్షద్, యార్ వినోద్, సారా, యువరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
(ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?)
అయితే ఈ సినిమాలో హీరో అంటూ ఎవరూ ఉండరని దర్శకుడు చెప్పాడు. ఇది ఐదుగురు బ్యాచిలర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా తీసిన సినిమాని చెప్పుకొచ్చాడు. యుక్త వయసులో దురాలవాట్ల కారణంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పే కథ ఇదని అన్నాడు. అరుణ్, గౌతమ్ కాంబో సంగీతాన్ని అందించారు. అయితే తాజాగా రిలీచ్ చేసిన టైటిల్ రివీల్ మంచి ఫన్నీగా ఉంది. రాబోయే ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment