స్టార్ డైరెక్టర్-యంగ్ హీరోయిన్ పెళ్లి? షాక్‌లో ఫ్యాన్స్! | Brigida Saga And Vignesh Karthik Wedding Pic Details | Sakshi
Sakshi News home page

Brigida Saga: పెళ్లి గెటప్‌లో కనిపించారు.. నిజం ఏంటంటే?

Published Sat, Jul 27 2024 12:21 PM | Last Updated on Sat, Jul 27 2024 12:32 PM

Brigida Saga And Vignesh Karthik Wedding Pic Details

ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. ఏ భాషలో తీసుకున్నా సరే ఇలాంటి జంటలు చాలానే కనిపిస్తుంటాయి. నాలుగైదు రోజుల క్రితం కన్నడ హీరోయిన్ సోనాలి.. దర్శకుడు తరుణ్ సుధీర్‌తో పెళ్లికి రెడీ అయింది. ఆగస్టులో పెళ్లి ఉంటుందని చెబుతూ ఏకంగా ప్రీ వెడ్డింగ్ వీడియోనే పోస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్లలానే తమిళ స్టార్ డైరెక్టర్-హీరోయిన్ పెళ్లి దుస్తుల్లో కనిపించడం అందరినీ షాక్‪‌కి గురిచేసింది.

(ఇదీ చదవండి: 'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?)

తమిళంలో 'అడియే', 'తిట్టం ఇరండు', 'హాట్ స్పాట్' సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేశ్ కార్తీక్.. యంగ్ హీరోయిన్ బ్రిగిడ సాగాతో కలిసి సం‍ప్రదాయ పెళ్లి దుస్తుల్లో కనిపించాడు. ఆ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. సడన్‍‌గా చూసి నిజంగానే ఈ డైరెక్టర్, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నారు. కానీ ఇదంతా ఓ సినిమా కోసం జరిగిన షూట్.

ఎందుకంటే ఇదివరకే దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్‌కి పెళ్లయింది. మరోవైపు బ్రిగిడ.. తమిళ, తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే వీళ్లిద్దరూ పెళ్లి డ్రస్సులో కనిపించేసరికి చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. అసలు విషయం తెలిసి తాపీగా నవ్వకున్నారు. ఏదేమైనా ఇలా సినిమా ప్రమోషన్ చేయడమంటే ఫస్ట్ షాకవుతారు. ఆ తర్వాత నవ్వుకుంటారు!

(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement