
గత 30 ఏళ్లుగా తన చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తాజాగా టిన్స్ చిత్రం ద్వారా మీ ముందుకు రాబోతున్నానని,
కోలీవుడ్‌లో ప్రయోగాత్మక కథా చిత్రాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారిన దర్శక నటుడు రాధాకృష్ణన్ పార్తీపన్. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ఇరవిన్ నిళల్. బయోపిక్ డ్రీమ్స్ అండ్ అకీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మితమైన ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందడంతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈయన తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అయ్యారు. అదే టీన్స్ మూవీ.
థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బయోపిక్ డ్రీమ్స్ ఎల్ ఎల్‌పీ అండ్ అకీరా ప్రొడక్షన్స్ సంస్థల అధినేతలు కాల్డ్ వెల్ వేల్ నంబి, డాక్టర్ స్వామినాథన్, డాక్టర్ పిన్చీ శ్రీనివాసన్, రంజిత్ దండపాణి, కీర్తన పార్తీపన్ అక్కినేని నిర్మిస్తున్నారు. దీనికి డి.ఇమ్మాన్ సంగీతాన్ని, గవెమిక్ ఆర్వీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. శనివారం నాడు ఈ మూవీ పోస్టర్లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా పార్తీపన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా తన చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తాజాగా టిన్స్ చిత్రం ద్వారా మీ ముందుకు రాబోతున్నానని, ఇది సరికొత్త ప్రయోగాత్మక కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్, ఛాయాగ్రాహకుడు గవెమిక్ ఆర్వీలతో కలిసి ఈనెల 20వ తేదీన విడుదల చేసినట్లు వెల్లడించారు.
చదవండి: ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లిన చిరంజీవి, చరణ్..