స్టార్ హీరో కట్టించిన గుడిలో మరో హీరో.. వీడియో వైరల్ | Raghava Lawrence Visits Thalapathy Vijay's Sai Baba Temple | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: దళపతి విజయ్ కట్టించిన బాబా గుడిలో లారెన్స్

Published Sun, Apr 14 2024 2:46 PM | Last Updated on Sun, Apr 14 2024 3:20 PM

Raghava Lawrence In Thalapathy Vijay Baba Temple - Sakshi

దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియాలో ట్రోల్స్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంటాడు. అయితే విజయ్ తన సొంతూరు కొరట్టూర్ లో సాయిబాబా కట్టించున్నాడే విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ఆలయాన్ని నటుడు-కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శించుకున్నాడు.

(ఇదీ చదవండి: లిప్‌లాక్‌ సీన్స్‌ వద్దని మా నాన్న చెప్పారు: టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌)

సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న విజయ్.. తన తల్లి శోభ కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ మహా కుంభాభిషేకాన్ని ఇటీవల నిర్వహించారు. విజయ్‌ ఈ మధ్య ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన ఫొటోలు బయటకు రావడంతోనే ఈ విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ ఆలయాన్ని రాఘవ లారెన్స్‌.. విజయ్‌ తల్లితో కలిసి సందర్శించాడు.

తాను నిర్మించిన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని నటుడు విజయ్‌ తల్లి శోభ సందర్శించి, పాటలు కూడా పాడారన్నారు. ఇప్పుడు ఆయన నిర్మించిన సాయిబాబా ఆలయాన్ని తాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని లారెన్స్ చెప్పుకొచ్చాడు. విజయ్‌ ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: మెగాస్టార్ చిరంజీవి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement