విజయ్ సేతుపతి చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. 'మహారాజ' మూవీతో తెలుగు, తమిళంలో అద్భుతమైన వసూళ్లు సొంతం చేసుకుంటున్నాడు. మూవీ వచ్చిన రెండు వారాలైనప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. మరోవైపు ఇతడు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ఓ తమిళ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
సేతుపతి అద్భుతమైన నటుడు. కాకపోతే సరైన హిట్ పడి చాలా కాలమైంది. రీసెంట్‌గా తన 50వ మూవీ 'మహారాజ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. మరోవైపు ఇతడు అతిథి పాత్రలో నటించిన తమిళ మూవీ 'అళగియ కన్నె'.. గతేడాది జూన్ 23న థియేటర్లలోకి వచ్చింది. ఏమైందో ఏమో గానీ ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిందే లేటు అంటే మళ్లీ అద్దె విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
రొమాంటిక్ డ్రామా స్టోరీతో తీసిన ఈ సినిమాలో లియో శివకుమార్, సంచితా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఆర్ విజయ్ కుమార్ దర్శకుడు. ఈ మూవీ డైరెక్టర్‌పై ఉన్న అభిమానంతోనే విజయ్ సేతుపతి.. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నటించాడు. ఇందులో నిజ జీవిత పాత్రనే పోషించడం విశేషం. కాకపోతే సినిమా రొటీన్‌గా ఉండేసరికి జనాలు సినిమా పెద్దగా ఆడలేదు.
దర్శకుడు కావాలనే ఓ కుర్రాడు.. నాటకాల్లో పరిచయమైన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ కులాల వేరు కావడంతో పెద్దలు ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ఈ కుర్రాడికి విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎలా వచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?)
Comments
Please login to add a commentAdd a comment