ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. చాలా కాలం నుంచి అనాథలు, దివ్యాంగులని ఆదుకునేందుకు ట్రస్టు ఏర్పాటు చేసి, దాని ద్వారా వారికి తగిన సాయం చేస్తూ వస్తున్నాడు. ఎందరికో ఎన్నో విధాలుగా సాయం చేస్తూ.. తన చిత్రాల్లో దివ్యాంగులను నటింపజేస్తూ వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా దివ్యాంగులకు కానిదేదీ లేదనేలా వారిని తమిళ పారంపర్య కళ అయిన మల్లర్ కంబం అనే విలువిద్యలో ప్రోత్సహిస్తున్నారు.
కై కొడుక్కుమ్ కై అనే ఈయన నాయకత్వంలో దివ్యాంగుల బృందం ఇప్పటికే మల్లర్ కంబం అనే సాధారణ వ్యక్తులు కూడా చేయలేని సాహస కళను పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఈ బృందం సోమవారం రాఘవలారెన్స్ నేతృత్వంలో చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మల్లర్ కంబం అనే సాహస కళను ప్రదర్శించారు. వీరి కళను ప్రోత్సహించాల్సిందిగా ఈ సందర్భంగా రాఘవలారెన్స్ విజ్ఞప్తి చేశారు.
వీరికి తాను తగినంత సాయం చేస్తున్నానని, తన చిత్రాల్లోనూ నటింపజేసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. అయితే కొందరు అన్ని చిత్రాల్లోనూ వీరిని ఎలా నటింపజేస్తామని అంటుంటారన్నారు. మీ ఇళ్లల్లోనో, ఇతరుల ఇళ్లల్లోనో జరిగే వేడుకల్లో ఇలాంటి టీమ్‌కు అవకాశం కల్పించి ప్రోత్సహించాలని కోరారు. తాను ఈ మల్లర్ కంబం కళ బృందంలోని ప్రతి ఒక్కరికీ ఒక స్యూటీని ఇవ్వనున్నానని చెప్పారు. అలాగే దివ్యాంగుల ఇతి వృత్తంతో ఒక చిత్రం చేయబోతున్నానని, అందులో తానూ దివ్యాంగుడి పాత్రలో నటించనున్నానని చెప్పా రు. ఈ చిత్రం ద్వారా వచ్చిన లాభాలతో వీరికి ఇళ్లు కట్టిస్తానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment