
విక్రమ్
శివపుత్రుడు, అపరిచితుడు, ఐ.. ఇలా చేసే ప్రతి సినిమాలోనూ దాదాపు కొత్తగా కనిపిస్తారు విక్రమ్. ఇప్పుడు మళ్లీ కొత్త గెటప్‌లోకి మారే టైమ్ వచ్చింది. విక్రమ్ హీరోగా ‘డిమాంట్ కాలనీ, ఇమైక్క నొడిగళ్’ చిత్రాల ఫేమ్ ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విక్రమ్ పలు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుందని కోలీవుడ్ సమాచారం. తొలి షెడ్యూల్ చిత్రీకరణను చెన్నైలో ప్లాన్ చేశారని తెలిసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment