
‘‘కలల్లో కానరాకున్నా... నీ కోసం నేను వేచున్నా... నిన్నే నా ఏడు జన్మల తోడుగా కోరుకుంటున్నా’’ అంటూ మొదలవుతుంది ‘వీర ధీర శూరన్ పార్టు 2’ సినిమాలోని లవ్ సాంగ్. విక్రమ్ హీరోగా ఎస్.యు అరుణ్‌కుమార్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రియా శిబుల నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాలోని ‘కలల్లో..’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. రాజేశ్ గోపిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటను శరత్ సంతోష్, రేష్మ శ్యామ్ పాడారు. దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరాముడు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment