హీరో విక్రమ్ 63వ చిత్రం షురూ అయింది. ‘చియాన్ 63’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు మేకర్స్. ‘మండేలా, మావీరన్’ (తెలుగులో ‘మహావీరుడు’) వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు మడోన్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శాంతి టాకీస్‌పై అరుణ్ విశ్వ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా అరుణ్ విశ్వ మాట్లాడుతూ– ‘‘దేశంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరైన విక్రమ్‌తో కలిసి మా ప్రోడక్షన్ నంబర్ 3ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది.
మనకు ఎన్నో చిరస్మరణీయమైనపాత్రలు, సంచలనాత్మక చిత్రాలను అందించిన విక్రమ్‌గారితో సినిమా నిర్మించనుండటం మాకు గౌరవం. మడోన్ అశ్విన్‌తో రెండో సినిమా చేయనుండటం చాలా ఆనందంగా ఉంది. విక్రమ్‌గారికి కరెక్టుగా సరిపోయే కథతో ఆయన్ని సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారు మడోన్ అశ్విన్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment