Malavika Mohanan Shocking Comments On High Budget Movies, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్‌

Published Tue, Aug 1 2023 6:51 AM | Last Updated on Tue, Aug 1 2023 10:22 AM

Malavika Mohanan Comments On High Budget Movies - Sakshi

మోడలింగ్‌ నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన నటి మాళవిక మోహన్‌. తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ వార్తల్లో ఉండే ఈమె మొదట్లో మాతృభాష అయిన మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా పట్టం బోల చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది ఈ బ్యూటీ. ఆ చిత్రం 2013లో తెరపైకి వచ్చింది. ఆ తరువాత రజినీకాంత్‌ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం పేట ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అలా అక్కడ కూడా తొలి చిత్రంతోనే తన నటనతో సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. 

(ఇదీ చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!)

ఆ తర్వాత విజయ్‌ సరసన మాస్టర్‌ చిత్రంలోనూ, ధనుష్‌కు జంటగా మారన్‌ చిత్రం లోనూ నటించింది. ప్రస్తుతం పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్‌ చిత్రంలో విక్రమ్‌తో జతకట్టింది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటోంది. తంగలాన్‌ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి మాళవిక మోహన్‌ కూడా చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. తంగలాన్‌ చిత్రం కలిగించిన నమ్మకమో ఏమో గానీ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తను సినీ రంగప్రవేశం చేసి ఇప్పటికి దశాబ్దం పూర్తయిందని గుర్తుచేసుకుంది.

(ఇదీ చదవండి: 'జవాన్‌' మొదటి పాట రిలీజ్‌.. దీనికి పెట్టిన ఖర్చుతో సినిమానే తీయవచ్చు)

ఇకపై తన కథ పాత్రలకు ప్రాముఖ్యత ఉండే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అది రూ.500 కోట్ల వసూలు చేసే భారీ బడ్జెట్‌ చిత్రం అయినా సరే తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అందులో నటించడానికి అంగీకరించనని చెప్పారు. అలాంటి చిత్రాలు సూపర్‌ హిట్‌ అయినా తన పాత్రకు గుర్తింపు ఉండదు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు నటి మాళవిక మోహన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement