‘‘టెక్నాలజీని మనం ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించి కొందరు ప్రముఖ సంగీత దర్శకులు చేసిన సంగీతం, పాటలు శ్రోతలను ఎందుకు మెప్పించలేకపోయాయి? అనే విషయాలపై నేను మాట్లాడను. కానీ సినిమా స్క్రిప్ట్, అందులో నుంచి వచ్చే సందర్భాలపైనే సంగీత దర్శకులు ఇచ్చే సంగీతం ఆధారపడి ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్.
విక్రమ్ హీరోగా నటించిన తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘తంగలాన్’. పా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జీవీ ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ కథ ప్రధానంగా ట్రైబల్స్ నేపథ్యంలో ఉంటుంది. దాంతో ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్ ట్రైబ్స్‌కు చెందిన సంగీతాన్ని కూడా పరిశీలించాను.
సినిమా సంగీతానికి, ట్రైబల్స్ సంగీతానికి మధ్యలో నేను ఓ వారధిగా ఉంటూ ఈ సినిమా మ్యూజిక్‌ను ప్రేక్షకులకు చేరువ చేయడం సవాల్‌గా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. విక్రమ్‌గారితో ఇది నా మూడో సినిమా. నా సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్, ఆకాశం నీ హద్దురా!’ లాంటి మ్యాజిక్ ‘తంగలాన్’తో రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment