దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాలీవుడ్ బ్యూటీల హవా కొనసాగుతూనే ఉంది. నటి నయనతార, ప్రియాంక మోహన్ వంటి మలయాళం భామలు పలు భాషల్లో నటిస్తున్నారు. తాజాగా నటి మాళవికమోహన్ కథానాయకిగా ఉన్నత స్థాయికి ఎదగడానికి శ్రాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ కేరళ జాణ సీనియర్ మలయాళ ఛాయాగ్రాహకుడు మోహన్ వారసురాలు. 2013లో మలయాళ చిత్ర పరిశ్రమలో కథానాయకిగా రంగప్రవేశం చేశారు. తరువాత హిందీ, తమిళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో శశికుమార్‌కు భార్యగా కీలక పాత్రలో నటించి గుర్తింపు పొందారు.
(ఇదీ చదవండి; 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో)
ఆ తరువాత విజయ్‌తో మాస్టర్, ధనుష్‌కు జంటగా మారన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ సరసన 'తంగలాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొత్త మాళవికమోహన్ చూస్తారని చెబుతున్న ఈ భామ ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ స్టార్ హీరోలతో జత కడితేనే హీరోయిన్లకు క్రేజ్ వస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తన తల్లి 1970, 80 ప్రాంతంలో మలయాళం చిత్రాలు ఎక్కువగా చూసే వారన్నారు. హీరోయిన్లు మంచి కథా పాత్రల్లో నటిస్తే అభినందించే వారని చెప్పారు. అలాంటి పాత్రల కోసం ప్రార్థించుకోవాలని చెప్పేవారని, అప్పట్లో ఆమె చెప్పింది తను మనసుకు ఎక్కేది కాదని, ఇప్పుడు అర్థం అవుతోందని అన్నారు. అయితే తాను ఇప్పటికే నటిగా ఒక రౌండ్ చుట్టేశానని, ఇకపై మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తానని మాళవికమోహన్ పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: వీళ్లూ హీరోలే.. కానీ విలన్లగానూ మెప్పిస్తారు)
Comments
Please login to add a commentAdd a comment