Chandrayaan 3 Vikram Sends Pictures of Moon Far Side - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-3: చంద్రుడికి అవతల.. అరుదైన ఫొటోలు తీసిన విక్రమ్‌

Published Mon, Aug 21 2023 9:04 PM | Last Updated on Mon, Aug 21 2023 9:18 PM

Chandrayaan 3 Vikram sends pictures of Moon far side - Sakshi

చంద్రుడి దక్షిణ ధ్రువంపై సున్నితంగా ల్యాండ్‌ అయ్యేందుకు అనువైన ప్రదేశం.. 

బెంగళూరు: చంద్రుడిపైకి  ఇస్రోవారి విక్రమ్‌ ల్యాండర్‌ అడుగు పెట్టే క్షణాల కోసం యావత్‌ భారత్‌ మాత్రమే కాదు.. రష్యా 47 ఏళ్ల తర్వాతి ప్రయోగం విఫలం కావడంతో ఒక్కసారిగా  ప్రపంచం మొత్తం చంద్రయాన్‌-3 కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. 

చంద్రుడి దక్షిణ ధ్రువంపై సున్నితంగా ల్యాండ్‌ అయ్యేందుకు అనువైన ప్రదేశం కోసం ల్యాండర్‌ అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలో.. చంద్రుడిపై దక్షిణ ధ్రువ ప్రాంతం.. అదీ భూమికి మునుపెన్నడూ కనిపించని ప్రాంతాలను తన కెమెరాతో బంధిస్తోంది. సాధారణంగా.. చంద్రుడు మనకు ఒకవైపే కనిపిస్తాడు. అయితే.. అవతలివైపు విక్రమ్‌ ల్యాండర్‌ తీస్తున్న ఫొటోల్లో..  ఉపరితంపై అనేక బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

ఆగస్టు 19వ తేదీనే ఈ ఫొటోలు తీసినట్లు ఇస్రో వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం.. 23వ తేదీ సాయంత్రం 6.04 నిమిషాలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై ల్యాండ్‌ కావాల్సి ఉంది. ఒకవేళ చంద్రయాన్‌-3 గనుక సక్సెస్‌ అయితే.. సోవియట్‌ యూనియన్‌(పూర్వపు రష్యా), అమెరికా, చైనా సరసన భారత్‌ నిలవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement