
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. మాళవిక మోహనన్ హీరోయిన్. పశుపతి ముఖ్యపాత్ర పోషించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించగా.. స్టూడియో గ్రీన్ పతాకంపై కే.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలార్‌లోని కేజీఎఫ్ నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. అయితే వచ్చే వారంలో రిలీజ్ కావాల్సిన చిత్రం ఇప్పుడు వాయిదా పడింది.
(ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?)
ఈ సినిమా కోసం విక్రమ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. షూటింగ్ అయితే చాన్నాళ్ల నుంచి చేస్తూ వచ్చారు. తొలుత సంక్రాంతి అన్నారు. ఆ తర్వాత జనవరి 26 అని డేట్ ప్రకటించారు. తాజాగా ఇప్పుడు వేసవికి 'తంగలాన్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇలా మళ్లీ మళ్లీ వాయిదా పడటంతో విక్రమ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.
అయితే ఈ వాయిదాకు కారణం ఏమిటో తెలియలేదు. అదేవిధంగా అందులో తేదీని చెప్పలేదు. ఒకవేళ చెప్పినట్లు వేసవికి రిలీజ్ చేస్తారా? మళ్లీ అప్పుడు వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అయితే తమిళ నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్ 1న మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని పోస్టర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేసింది.
(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?)
In the darkness of Kolar Gold mines is a story waiting to be told. 👷#Thangalaan is coming soon on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada, Hindi after theatrical release! #NetflixPandigai pic.twitter.com/8JXA9sEvdI
— Netflix India South (@Netflix_INSouth) January 17, 2024