Lokesh Kanagaraj Assistant To Direct Chiyaan Vikram 62nd Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Chiyaan Vikram 62nd Movie: విక్రమ్‌ కోసం కథ సిద్ధం చేస్తున్న స్టార్‌ డైరెక్టర్‌

Published Mon, Jul 10 2023 6:48 AM | Last Updated on Mon, Jul 10 2023 10:33 AM

 Lokesh Kanagaraj Assistant To direct Chiyaan Vikram - Sakshi

సినిమా పరిశ్రమలో వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్‌ నటుడు విక్రమ్‌. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం 'తంగలాన్‌'. ఈ చిత్రం కోసం విక్రమ్‌ చాలా ఢిపరెంట్‌గా మేకోవర్‌ అయ్యారు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. దీంతో ఆ చిత్రం మూడ్‌ నుంచి బయటపడ్డ విక్రమ్‌ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన నటించనున్న 62వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి క్రేజీ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఈయన విజయ్‌ కథానాయకుడిగా 'లియో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: రవితేజని ఫాలో అయిపోతున్న తమ్ముడి కొడుకు)

ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. 'లియో' చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్‌ కోసం లోకేష్‌ కనకరాజ్‌ కథను సిద్ధం చేసే పనిలో ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని ఆయన శిష్యుడు మహేష్‌ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహించినట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం విజయ్‌ హీరోగా 'లియో' చిత్రాన్ని నిర్మిస్తున్న సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో అధినేత లలిత్‌కుమార్‌ విక్రమ్‌ హీరోగా నటించే చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు విక్రమ్‌ ప్రస్తుతం ప్రత్యేకంగా పొటో సెషన్‌ ఏర్పాటు చేసుకుని దిగిన డిఫరెంట్‌ గెటప్‌లలో ఫొటోలను తీయించుకుని వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఆ స్టైలిష్‌ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement