విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా తంగలాన్. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఆగష్టు 15న విడుదల అయింది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్‌లలో తంగలాన్ వేట కొనసాగించి ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయింది. బాలీవుడ్‌లో కూడా విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి చిత్ర నిర్మాత ప్రకటన చేశారు.
డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే, తంగలాన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కానీ, స్ట్రీమింగ్ విషయంలో మేకర్స్ నుంచి పలు అడ్డంకులు రావడంతో ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ రిలీజ్ చేయలేదని ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇచ్చారు. 'దీపావళికి తంగలాన్ సినిమాను విడుదల చేయాలని వారు (నెట్‌ఫ్లిక్స్) నిర్ణయించారు. తంగలన్ పెద్ద సినిమా కాబట్టి పండుగ నాడు విడుదల చేస్తే బాగుంటదని తెలిపారు. అయితే, తంగలాన్ ఓటీటీ విడుదల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి సమస్య లేకున్నా కూడా.. సమస్య ఉందని చెప్పుకునే నేర్పు నేటి సోషల్‌మీడియా వార్తలకు ఉంది.' అని ఆయన తెలిపారు. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1న తంగలాన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావడం ఖాయమని చిత్ర నిర్మాత పేర్కొన్నారు.
కథేంటి..?
గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్‌ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment