
దసరాకు రిలీజ్ కానున్న మూవీస్ ఇవే

ఈ ఏడాది దసరా సందర్భంగా మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి

అందులో కొన్ని నేరుగా తెలుగులో విడుదలైతే.. మరికొన్ని తమిళం, హిందీ, కన్నడ సినిమాల డబ్బింగ్ వెర్షన్లు రానున్నాయి

(అక్టోబర్ 10న వేట్టైయాన్) రజనీకాంత్- టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్ సినిమా విడుదల కానుంది

(అక్టోబర్ 10న శ్రీ శ్రీ శ్రీ రాజావారు) నార్నె నితిన్ హీరోగా సతీష్ వేగేష్న దర్శకత్వంలో ఈ మూవీ రిలీజ్ కానుంది

( అక్టోబర్ 11న విశ్వం) గోపీచంద్- శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా రిలీజ్ అవుతుంది

(అక్టోబర్ 11న మా నాన్న సూపర్ హీరో) సుధీర్ బాబు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం విడుదల కానుంది

(అక్టోబర్ 11న మార్టిన్) కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి అర్జున్ సర్జా కథ అందించారు

(అక్టోబర్ 11న జిగ్రా) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది

(అక్టోబర్ 12న జనక అయితే గనక) సుహాస్ నటించిన ఫ్యామిలీ కాన్సెప్టెడ్ సినిమా రానుంది

అక్టోబర్ 10 నుంచి 'దేవర' సినిమా కలెక్షన్లపై ఈ చిత్రాల ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది